Anasuya Bharadwaj Shares a Shocking Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్‌

Published Thu, Aug 25 2022 4:44 PM | Last Updated on Thu, Aug 25 2022 7:11 PM

Anasuya Bharadwaj Shares a Shocking Tweet Goes Viral - Sakshi

సోషల్‌ మీడియాలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటీవల వాపోయిన యాంకర్‌ అనసూయ తాజాగా ఓ సంచలన ట్వీట్‌ చేసింది. ఉసురు ఊరికే పోదు అంటూ తెలుగులో ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది. ఇంతకి ఆమె ఏం చేసిందంటే.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!!’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

చదవండి: ఆ డైరెక్టర్‌కి అలా హగ్‌ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా

అంతేకాదు దీనికి NotHappyOnsomeonesSadness, FaithRestored అనే హ్యాష్‌ ట్యాగ్‌లను కూడా జతచేసింది. ‘ఇతరుల బాధను చూసి ఆనందపడను కానీ కర్మ అనేది తిరిగివస్తుంది’ అని పేర్కొంది. ఇక అనసూయ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె ట్వీట్‌ ఆంతర్యం ఏంటని, ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటుండగా మరికొందరు ఇది విజయ్‌ దేవరకొండను ఉద్ధేశించి చేసిందని అభిప్రాయపడుతున్నారు. అర్జున్‌ రెడ్డిలో తల్లిపై విజయ్‌ చేసిన ఓ కామెంట్స్‌ను గుర్తు చేస్తూ లైగర్‌ టాక్‌ను ఉద్దేశించి చేసిందంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ ఆమెపై ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్‌.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ

ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్‌ బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచార కేసులో నిందితులైన వారిని విడిచిపెట్టడమే కాకుండా వారిని ఓ సంస్థ సన్మానించడంపై మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను అనసూయ రిట్వీట్‌ చేయడంతో నెట్టింట తీవ్ర దూమారం రేగింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు దానిపై ఎందుకు స్పందించలేదని ఆమెను ప్రశ్నించారు. ఇక సోషల్‌ మీడియా తనపై జరుగుతున్న దాడికి అనసూయ స్పందించింది. తాను ఏం చేసిన రాజకీయం చేస్తున్నారని, అందువల్లే తను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నానంది. దయ చేసి తన ట్వీట్స్‌ను రాజకీయం చేయొద్దంటూ నెటిజన్లను వేడుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement