
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ కాంబినేషన్ కుదిరిందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నిఖిల్ హీరోగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ ఎంపికైనట్లు సమాచారం.