Lucifer Remake In Telugu Cast: Anushka Shetty May Play Chiranjeevis Sister In Lucifer Remake - Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా?

Published Mon, May 24 2021 4:52 PM | Last Updated on Mon, May 24 2021 7:37 PM

Anushka Shetty May Play Chiranjeevis Sister In Lucifer Remake - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వేవాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు. గతడేది మలయాళంలో విడుదలైన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్లు మార్పులు చేయనున్నారు. ఇక ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరలవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చాలామంది స్టార్ హీరోయిన్లు పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిరుకు చెల్లిగా అనుష్క శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో మూవీ టీం సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

చదవండి : Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్‌ చిరంజీవి సాయం
బర్త్‌డే: సైడ్‌ ఆర్టిస్ట్‌గా త్రిష తొలి సంపాదన ఎంతో తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement