టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క నిశ్శబ్ధం తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కానీ రారా కృష్ణయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన పి.మహేశ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నలభై ఏళ్ల అమ్మాయి, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి అని టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కోసమో, లేదంటే సినిమాలు చేయడంలో గ్యాప్ వచ్చినందువల్లో ఏమోగానీ అనుష్క లావెక్కింది.
దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే బొద్దుగుమ్మగా మారిన అనుష్క ఫొటోలను చూసిన నెటిజన్లు 'భలేగున్నావ్, తెగ ముద్దొస్తున్నావ్.. బుగ్గలు బర్గర్‌లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. చబ్బీ గర్ల్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది సైజ్ జీరో సినిమా సమయంలోని ఫొటోనా? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు.. స్వీటీ ఎప్పుడు సన్నబడుతుందంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
చదవండి: త్వరలోనే అనుష్క పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..!
Comments
Please login to add a commentAdd a comment