టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లవుతోంది. చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.
రెమ్యునరేషన్ డబుల్
గతంలో అనుష్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది. అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రానికిగాను ఆమె ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం.. సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్ముతుంది స్వీటీ.
డబ్బు కన్నా మనుషులే ముఖ్యం
గతంలో ఈ పారితోషికం గురించి అనుష్క మాట్లాడుతూ.. 'ఒక నటి 100 చిత్రాల్లో నటించడం, కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు.. కానీ ఎంతమంది ఫ్రెండ్స్‌కు సంపాదించుకున్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని పేర్కొంది.
చదవండి: గ్లామర్ క్వీన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా!
Comments
Please login to add a commentAdd a comment