త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి? | Arjun Das team denied rumours about his engagement and wedding | Sakshi
Sakshi News home page

త్వరలో హీరో అర్జున్ దాస్ పెళ్లి?

May 27 2026 11:50 PM | Updated on May 28 2026 6:05 AM

Arjun Das team denied rumours about his engagement and wedding

సౌత్‌లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్‌తో విలన్‌గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది.  

అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్‌ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.

ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement