నటి అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం ఇప్పడు ఒక సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సొంతం చేశాయి. సీరియల్స్‌లో, వెండితెర మీద నటిగా రాణిస్తున్న సమయంలో వచ్చిన ఆలోచన ఆమెకు పెద్ద సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. యాష్ ట్రిక్స్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో పేరు కాదు బ్రాండ్‌గా అవతరించింది. మేకప్ కిట్ ఎలా తయారు చేసుకోవాలి.. ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది వంటి వీడియోలతో పాటు అస్మిత చేసిన మోటివేషనల్ వీడియోలు అందరికీ వినోదంతో పాటు సమాచారాన్ని అందించాయి. తాజాగా ఆమె A1 from Day1 వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూకి యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అస్మిత మాట్లాడుతూ.. నటిగా నా కెరియర్ బాగా బిజీగా ఉన్న టైంలో నేను డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసాను. టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉన్నాను. సినిమాలలో అవకాశాలు బాగున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటి? అనే ప్రశ్నలు తోటి నటీనటుల నుంచి వచ్చాయి. దీన్ని ఎవరు చూస్తారు? అనే కామెంట్స్ కూడా విన్నాను. అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారందరూ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహకారం చాలా ఉంది.
పెళ్ళి, పిల్లలతో మహిళల కెరియర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాకసలు అర్థం కాదు, నేను నమ్మను. అదే నమ్మకంతో యాష్ ట్రిక్స్ మొదలు పెట్టాను. అసలు ఎలాంటి వీడియోలు చేయాలి అని మొదట చాలా ఆలోచించే వాళ్ళం. మన డైలీ రోటీన్, అవసరం అయ్యే విషయాలే మా వీడియోలకి ముడి సరకు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుంచి ఒక వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నాం. సుధీర్ , నేను భార్య భర్తలుగా నటిస్తున్న ఈ సిరీస్‌లో కమెడియన్ ఆలీ గారు ముఖ్యమైన పాత్రను పోషించారు. డిసెంబర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59.00 ధర నిర్ణయించాం. మా సిరీస్‌కు సబ్ స్క్రిప్షన్ మొదలు అయ్యింది. తప్పకుండా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్మాము. ప్రివ్యూ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మా నమ్మకం నిజం అయ్యిందనిపిస్తుంది' అన్నారు.
చదవండి: పూజలో పాల్గొన్న హీరో, తిట్టిపోస్తున్న నెటిజన్లు
శ్రీహాన్‌తో బ్రేకప్‌పై స్పందించిన సిరి
Comments
Please login to add a commentAdd a comment