asmitha
-
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
ఎగతాళి చేసినవాళ్లే నన్ను ఫాలో అవుతున్నారు: నటి
నటి అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం ఇప్పడు ఒక సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సొంతం చేశాయి. సీరియల్స్‌లో, వెండితెర మీద నటిగా రాణిస్తున్న సమయంలో వచ్చిన ఆలోచన ఆమెకు పెద్ద సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. యాష్ ట్రిక్స్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో పేరు కాదు బ్రాండ్‌గా అవతరించింది. మేకప్ కిట్ ఎలా తయారు చేసుకోవాలి.. ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది వంటి వీడియోలతో పాటు అస్మిత చేసిన మోటివేషనల్ వీడియోలు అందరికీ వినోదంతో పాటు సమాచారాన్ని అందించాయి. తాజాగా ఆమె A1 from Day1 వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూకి యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అస్మిత మాట్లాడుతూ.. నటిగా నా కెరియర్ బాగా బిజీగా ఉన్న టైంలో నేను డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసాను. టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉన్నాను. సినిమాలలో అవకాశాలు బాగున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటి? అనే ప్రశ్నలు తోటి నటీనటుల నుంచి వచ్చాయి. దీన్ని ఎవరు చూస్తారు? అనే కామెంట్స్ కూడా విన్నాను. అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారందరూ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహకారం చాలా ఉంది. పెళ్ళి, పిల్లలతో మహిళల కెరియర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాకసలు అర్థం కాదు, నేను నమ్మను. అదే నమ్మకంతో యాష్ ట్రిక్స్ మొదలు పెట్టాను. అసలు ఎలాంటి వీడియోలు చేయాలి అని మొదట చాలా ఆలోచించే వాళ్ళం. మన డైలీ రోటీన్, అవసరం అయ్యే విషయాలే మా వీడియోలకి ముడి సరకు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుంచి ఒక వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నాం. సుధీర్ , నేను భార్య భర్తలుగా నటిస్తున్న ఈ సిరీస్‌లో కమెడియన్ ఆలీ గారు ముఖ్యమైన పాత్రను పోషించారు. డిసెంబర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59.00 ధర నిర్ణయించాం. మా సిరీస్‌కు సబ్ స్క్రిప్షన్ మొదలు అయ్యింది. తప్పకుండా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్మాము. ప్రివ్యూ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మా నమ్మకం నిజం అయ్యిందనిపిస్తుంది' అన్నారు. చదవండి: పూజలో పాల్గొన్న హీరో, తిట్టిపోస్తున్న నెటిజన్లు శ్రీహాన్‌తో బ్రేకప్‌పై స్పందించిన సిరి -
Thailand Open: మెయిన్ ‘డ్రా’కు అష్మిత అర్హత
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతారలు అష్మిత చాలియా, మాళవిక బన్సోద్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అష్మిత 21–16, 21–18తో జెనీ గాయ్ (అమెరికా)పై... మాళవిక 21–18, 21–8తో అనుపమ ఉపాధ్యాయ్ (భారత్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ప్రియాన్షు రజావత్, శుభాంకర్, కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. -
రావణలంక
మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి ‘రావణ లంక’ అనే టైటిల్ ఖరారు చేశారు. బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో క్రిష్ సమర్పణలో కె. సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బేనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రిష్, అస్మిత, త్రిష ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. ఉజ్జల్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హైలైట్. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
సుధీర్ కుమార్‌తో పదమూడేళ్ల పరిచయం
సినిమా, సీరియల్ నటిగా తెలుగువారికి సుపరిచితురాలైన అస్మిత తొలిసారి ‘స్టార్ మా’ టీవీలో వచ్చే ‘అగ్నిసాక్షి’లో విలనిజం చూపుతోంది. ‘పాజిటివ్ రోల్‌కి పరిమితులు ఉంటాయి, అందుకే నెగిటివ్ రోల్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశా.. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా నా కల నెరవేరింది’ అంటూ ఎన్నో కబుర్లను పంచుకుంది అస్మిత కర్నాని. ‘అగ్నిసాక్షి’గా నెగిటివ్ రోల్! ఈ సీరియల్‌కు ముందు చేసినవన్నీ పాజిటివ్ రోల్సే. కొంతకాలానికి బోర్ వచ్చింది. ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది అనుకున్నాను. అందుకోసం చాలా ఎదురు చూశా. ఇప్పుడు విలన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చే తిట్లను ఎంజాయ్ చేస్తున్నా. ఈ వర్క్ మిగతావాటికి భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రంగంలో ఉన్న ప్రతి డైరెక్టర్ వద్ద రెండు–మూడు సీరియల్స్ అయినా చేసి ఉన్నాను. కానీ, నన్ను పాజిటివ్‌గా చూసిన వాళ్లు నెగిటివ్ రోల్‌కి యాక్సెప్ట్ చేయలేదు. మొత్తానికి అగ్నిసాక్షి సీరియల్ ద్వారా నా కల నెరవేరింది. భూదేవి పాత్రను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైనా కలిసినప్పుడు ‘మిమ్మల్ని చూసి పలకరించడానికి భయపడ్డాం. కానీ, మీరు మంచిగానే ఉన్నారండి’ అంటుంటారు. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఫీల్డ్‌లో గ్లామర్ చేస్తే దానికే పరిమితం, హీరోయిన్గా పాజిటివ్ రోల్ చేస్తే అదే లేబుల్. ఇప్పుడు నెగిటివ్ రోల్స్ బాగా వస్తున్నాయి. దీంతో ‘హమ్మయ్య’ అనుకుంటున్నాను. లుక్స్‌కే ముందస్తు ప్రిపరేషన్ పెర్ఫార్మెన్స్ వరకైతే ప్రాక్టీస్ ఏమీ లేదు. లుక్స్ కోసం మాత్రం మొదట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమాలు, సీరియల్స్‌లో విలన్ రోల్ చూసి అందులో నన్ను నేను పోల్చుకునేదాన్ని. నా మొదటి సీరియల్‌కి ఇప్పటికీ నటనలో కొద్ది తేడా ఉంటుంది. అదంతా ఆ ఫ్లోలోనే వస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేసి ఉండటంతో డ్రెస్సింగ్ విషయంలోనూ ఐడియా ఉంది. విలనిజం లుక్స్కోసం మేకప్, డ్రెస్సింగ్, హెయిర్‌స్టైల్..ఇలా ప్రతీది ప్రేక్షకుల అటెన్షన్ నా వైపుకు తిప్పుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే.. ఇన్నిరోజులు చేసిన పాజిటివ్ రోల్స్ అన్నీ మర్చిపోయా. ఇప్పుడు చేస్తున్న సీరియల్పైనే నా దృష్టి అంతా. నెగిటివ్కీ ఓ క్యారెక్టర్ విలన్ రోల్ కదా ఏదైనా చేసేస్తాను అనుకోను. విలన్‌కైనా ఒక క్యారెక్టర్ ఉండాలి. తనెందుకు అలా మారిందో తెలిసుండాలి. ఆ పాత్ర మూలం మారకూడదు. అలా ఉంటేనే ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నానో అదే నాకు స్ఫూర్తి. ఇంట్లో చూడరు మేం మార్వాడీలం. మా ఇంట్లో వాళ్లకు భాష రాకపోవడం వల్ల అర్థం కూడా కాదు. అందుకే ఎవరూ నా సీరియల్స్ చూడరు. కాకపోతే నాకు అందరిలో ఉన్న గుర్తింపు వాళ్లకు తెలుసు. చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. అయితే అవేవీ వద్దని ఇంట్లో చెప్పేశారు. కాలేజీ రోజుల్లో ఒక బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచాను. అప్పుడే మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. టీవీ సీరియల్లోనూ ఆఫర్ వచ్చింది. ఇంట్లో వద్దని చెప్పినా ‘ఈ ఒక్క సీరియల్ చేస్తాను’ అని రెండేళ్ల పాటు బతిమాలాను. ఆ ఒకటి తర్వాత ఇంకొకటిæ సీరియల్స్ చేస్తూనే ఉన్నాను. రెండేళ్లలోనే నా వర్క్ ఏంటో నాకూ, ఇంట్లోవారికీ అర్థమె పోయింది. మొదట్లో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సీరియల్స్ రావడంతో పూర్తిగా ఇటే వచ్చేశాను. మంచి రోల్ ఉంటే మధ్య మధ్యలో సినిమాల్లోనూ చేశాను. పదమూడేళ్ల పరిచయం కొరియోగ్రాఫర్ సుధీర్ కుమార్‌ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. మేం పదమూడేళ్ల క్రితం ఓ డ్యాన్స్ షో చేశాం. అలా మొదలయ్యింది మా పరిచయం. ఎనిమిది నెలలు ఆ షో కోసం చేసిన ప్రాక్టీస్‌తో మంచి స్నేహితులమయ్యాం. తర్వాత ఇద్దరికీ అర్ధమైపోయింది లవ్ అని. ఇంట్లో అందరికీ కొరియోగ్రాఫర్‌గా సుధీర్ ముందే తెలుసు. మా ఫ్యామిలీలో మూడు పెళ్ళిలకు సుధీర్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. పదకొండేళ్ల తర్వాత ఇంట్లో పెద్దవాళ్లు ‘ఇద్దరూ ఆలోచించుకొని, డిసైడ్ అవ్వండి. ఇంకా ఎందకు ఆలస్యం’ అన్నారు. నెలలో పదిహేను రోజులు పనిని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలనే లక్ష్యం, బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నాకున్న ఇష్టంతో ఈ పని చేస్తున్నాను. నెలలో ముప్పై రోజులు పని చేస్తే ఆ పని పట్ల ఆసక్తి చచ్చిపోతుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఆర్నెళ్లు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పనిచేశాను. అప్పుడు చాలా చిరాకుపడేదాన్ని. నా చుట్టూ ఉన్నవారి మీద అరిచేసేదాన్ని. ఒకరోజు ‘ఎందుకిదంతా, ఎవరికోసం వర్క్ చేస్తున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. నెలలో 15–18 రోజులు వర్క్ చేయాలి. మిగతా టైమ్ నా పర్సనల్ కోసం వాడుకోవాలి అని. ఆ టైమ్‌లో నాకిష్టమైన వ్యాపకాలు పెట్టుకున్నాను. కుటుంబంతో గడపగా ఉన్న ఖాళీ సమయంలో బ్యూటీ, లైఫ్‌స్టైల్ బ్లాగర్స్ నడుపుతున్నాను. బ్యూటీకి సంబంధించిన యూ ట్యూబ్ చానెల్ ఉంది. వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున నేను షూట్ చేస్తాను. మా వారు ఎడిటింగ్, అప్లోడ్ చేస్తుంటారు. చాలా మంది స్త్రీలు పెళ్లై, పిల్లలు పుట్టాక ఇంకేముందిలే అని అందం పట్ల దృష్టిపెట్టరు. కానీ, ఆ తర్వాత కూడా ఇంకా చాలా జీవితం ఉంది అనుకోవాలి. లుక్ మనకు హ్యాపీగా ఉండేలా చూసుకుంటే మన లోపలి నుంచి కూడా హ్యాపీనెస్ వస్తుంది. డిజిటల్ మీడియా ద్వారా ఇప్పుడా విషయాన్ని మహిళలకు చేరవేయడానికి ప్రయత్నిస్తున్నాను.’ – నిర్మలారెడ్డి -
హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..
తమిళనాడు ,పెరంబూరు: నా కూతుర్ని ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని సినీ నటి తల్లి నటుడిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం మయూరన్. ఇందులో అముదవానన్ హీరోగానూ, మిస్ ఇండియా (ఫెమీనా) కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్‌గానూ నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్‌కు హీరోహీరోయిన్లు ఇద్దరూ హాజరు కాలేదు. హీరో వస్తే తన కూతురు రాదని ఆమె తల్లి నిర్మాతలకు చెప్పింది. కారణం కోటీశ్వరురాలైన తన కూతురిని చిత్ర కథానాయకుడు అముదవానన్ ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కాగా చిత్ర ప్రమోషన్‌కు హీరోయిన్ రాకపోతే తానెందుకు రావాలని హీరో మొండికేస్తున్నాడని చిత్ర దర్శక నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు. నటి జ్యోతిక నటించిన జాక్‌పాట్, కృష్ణ హీరోగా నటించిన కళుగు 2 వంటి పెద్ద చిత్రాల మధ్య తమ చిత్రం విడుదల కాబోతోందని, ఇలాంటి సమయంలో చిత్రానికి ప్రచారం లేకపోవడం బాధగా ఉందని చిత్ర దర్శక నిర్మాతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నడిగర్‌సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు తేలకపోవడంతో సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేదని వాపోతున్నారు. -
నన్ను హీరోను చేసింది బెజవాడే
నేను పుట్టింది బెజవాడలోనే ..నన్ను హీరోను చేసింది కూడా బెజవాడేనని ఆ ఐదుగురు సినీహీరో వెంకట్ అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న ఎం అండ్ ఎం షోరూమ్ నిర్వాహకులు హీరో వెంకట్, హీరోయిన్ అస్మితలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకట్ మాట్లాడుతూ.. నేను బెజవాడలో పుట్టినప్పటికీ, చదువుకున్నదీ ముంబయిలో అని చెప్పారు. ప్రతి వేసవి సెలవులకు బెజవాడ వచ్చి, ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడినన్నారు. గాంధీనగర్‌లో సినిమా థియేటర్లు ఉన్న రోడ్డు అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ సినిమాలు చూసే హీరో అయ్యానని చెప్పారు. నేను క్యూలో నిల్చుని, బెంచి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన థియేటర్లలో నేను నటించిన సినిమాలు సీతారాముల కల్యాణం, శివరామరాజు వంటి సినిమాలు అత్యధిక రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉందన్నారు. ‘ఆ ఐదుగురు’ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుందని, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అయితే సమాజంలో ఎలా మార్పు తీసుకురాగలడన్నది ప్రధాన ఇతివృత్తమని వివరించారు. రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తక్కువగా ఉంటాయన్నారు. సినిమా హీరోయిన్ అస్మిత మాట్లాడుతూ..ఈ సినిమా తన మూడో చిత్రమని చెప్పారు. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు. నిర్మాత ప్రేమ్ పట్రా మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు.