
భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ ద్వారా డిసెంబర్ 2 న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది. డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో కూడా స్ట్రీమ్ అవుతున్నట్లు నిర్మాత రమేశ్ ఉడత్తు తెలిపారు.
ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ సి.ఈ.ఓ రాజీవ్ మాట్లాడుతూ.. ‘థియేటర్స్ ప్రేక్షకులకే కాకుండా ఓటిటి ప్రేక్షకులకు కూడా దగ్గర కావాలని ఓటిటి లో రిలీజ్ అవుతున్న మరో మంచి సినిమా ‘భగత్ సింగ్ నగర్’. ముందు ఈ టైటిల్ విని పేట్రియాటిక్ సినిమా అనుకున్నాను.సినిమా చూసిన తరువాత ఇందులో మంచి పేట్రియాటిజమే కాదు మంచి లవ్ స్టోరీ, మంచి కమర్సియల్ ఎలిమెంట్స్ తో పాటు సమాజానికి మంచి మెసేజ్ఇస్తూ చాలా చక్కగా చిట్రీకరించడం జరిగింది. ఇంతమంచి సినిమాను మా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ నుంచి ఓటిటి లో రిలీజ్ చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది’ అన్నారు.