ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే హీరోయిన్ సమంత. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ఆమె పెళ్లి తర్వాత విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటివరకు నటిగానే పరిచయమైన ఆమె బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా విచ్చేయడమంటే మాటలు కాదు. షో గురించి, అందులోని కంటెస్టెంట్ల గురించి, వారి రహస్యాల గుట్టు, గొడవలు, స్నేహాలు అన్నీ తెలిసి ఉండాలి. అవసరానికి తగ్గట్టు పంచులు వేయగలగాలి. ఇవన్నీ సమంత చేయగలుగుతుందా? అన్న సందేహాలను ఆమె పటాపంచలు చేశారు. మూడు గంటల మెగా ఎపిసోడ్‌ను ఆసాంతం నవ్వుతూ వినోదవంతంగా మలిచారు. ఇందుకు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, హైపర్ ఆదిలాంటి సెలబ్రిటీలు కూడా తమవంతు సపోర్ట్ చేశారు. అలా దసరా ఎపిసోడ్‌ను బ్లాక్‌బస్టర్ చేసిన సమంతనే మిగతావారాలకు కూడా హోస్ట్‌గా చేయమంటున్నారట. (చదవండి: బిగ్‌బాస్: సమంతే బాగా చేసిందట)
మూడు వారాల్లో సమంతే రానుందా?
కాగా వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగ్ ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడే 21 రోజులు ఉండబోతున్నారు. అందుకని బిగ్‌బాస్ బాధ్యతను కోడలుపిల్ల సామ్ భుజాలపైన వేశారు. ఈ క్రమంలో సామ్ చేసిన దసరా ఎపిసోడ్‌ను కలుపుకుని మొత్తంగా ఐదు ఎపిసోడ్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ బిగ్‌బాస్ టీమ్ సామ్‌కు రూ.2.10 కోట్లు చెల్లిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఎపిసోడ్‌కు రూ. 40 లక్షలు పైనే అందుకుంటున్నారు. అంటే ఓ సినిమాకు తీసుకోవాల్సినంత రెమ్యూనరేషన్‌ను బిగ్‌బాస్ చేస్తున్నందుకు వసూలు చేస్తోందన్నమాట. ఏదేమైనా పారితోషికం విషయంలో నాగార్జున కన్నా ఆయన కోడలే ముందుంది. నాల్గో సీజన్ మొత్తానికి గానూ నాగ్ ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటుంటే సమంత మాత్రం కేవలం మూడు వారాలకే రెండు కోట్ల పైచిలుకు అందుకుంటూ మామను మించిన కోడలు అనిపించుకుంది. మొత్తానికి సామ్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: దివి ఎలిమినేట్: సినిమా ఛాన్స్ కొట్టేసింది)
Comments
Please login to add a commentAdd a comment