ఇండియాలో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హిట్ షో బిగ్‌బాస్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ షో విజయవంతంగా ప్రసారమవుతోంది. తెలుగులో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు సీజన్లకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఐదో సీజన్‌కు కూడా మరోసారి నాగార్జునే హోస్ట్‌గా వచ్చే అవకాశాలున్నాయి.
కాగా తెలుగునాట బిగ్‌బాస్ ప్రతిసారి జూన్‌లో ప్రారంభమవుతుండగా గతేడాది కరోనా టెన్షన్ వల్ల షో ఆలస్యంగా మొదలైంది. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన నాల్గో సీజన్ డిసెంబర్ 20న అంగరంగ వైభవంగా ముగిసింది. ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యతను కనబర్చారు నిర్వాహకులు. యూట్యూబ్ స్టార్లను, బుల్లితెర సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించారు. వారు కూడా ఆటపాటలతో మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో వారికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో ఐదో సీజన్‌లో ఎవరెవర్ని తీసుకుంటారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో అరేయ్, ఏంట్రా ఇది? ఇంత బాగా నటించాడు అనిపించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ హౌస్‌లోకి రాబోతున్నాడు అని ఆయన అభిమానులు బలంగా ఫిక్సయ్యారు. తాజాగా ఓ సింగర్ కూడా ఈసారి రేసులో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ సింగర్ హేమచంద్ర బిగ్‌బాస్ షో ద్వారా తన అభిమానులను అలరించనున్నట్లు సమాచారం.
గతంలోనూ అతడికి బిగ్‌బాస్ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల వాటిని సున్నితంగా తిరస్కరించాడు. మరి ఈసారి ఈ ఛాన్స్‌ను వదులుకుంటాడా? లేదా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేస్తాడా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు కంటెస్టెంట్‌గా వస్తే మాత్రం టైటిల్ విన్నర్‌ను చేస్తామని శపథం చేస్తున్నారు ఆయన అభిమానులు. కానీ అతడికి బిగ్‌బాస్ నిర్వాకుల నుంచి పిలుపు వచ్చిందనేది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment