బిగ్‌బాస్ అంటేనే సెలబ్రిటీల హంగామా! ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నంత రేంజ్‌లో రచ్చ చేస్తుంటారు. టాస్కుల్లోనే కాదు పోట్లాటలకు కూడా ముందుంటారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా ఇదే.. కామెడీని పండించేందుకు ఒకరు, వయ్యారాలు ఒలకబోసేందుకు ఒకరు, శాపనార్థాలు పెట్టేందుకు ఒకరు, చిచ్చు రాజేసేందుకు ఒకరు, పాట పాడేందుకు, ఆట ఆడేందుకు, స్టెప్పులేసేందుకు, శోకరాగం అందుకునేందుకు.. ఇలా అన్ని ఎమోషన్లను పండించేవారినే ఒక్కొక్కరిగా సెలక్ట్ చేసుకుంటారు.
ఈసారి కూడా అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరేనంటూ చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సిరి హన్మంత్ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి తర్వాత సీరియల్స్ వైపు అడుగులేసి నటిగా రాణిస్తోంది. పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకు బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందట. మరి ఈ ఆఫర్‌ను ఆమె అంగీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ లోబోను కూడా ఈ సీజన్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment