
కొరియోగ్రాఫర్ నటరాజ్ తెలుగులో వస్తున్న డ్యాన్స్ రియాలిటీ షోలకు ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో చేసిన నటరాజ్ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. టాప్ హీరోలు, దర్శకులందరితో కలిసి పని చేసిన నటరాజ్ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది.
కృష్ణా జిల్లాకు చెందిన ఈ కొరియోగ్రాఫర్ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. తనను ఏడు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు నటరాజ్. ఇప్పుడామె ఏడునెలల గర్భవతని, అయినప్పటికీ బిగ్‌బాస్ కోసం తనను ఒంటరిగా వదిలేసి వచ్చానన్నాడు. మరి నటరాజ్ ఈ హౌస్‌లో ఎన్ని రోజులు నిలదొక్కుకుంటాడన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.