ఆ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్‌ విన్నర్‌: నటరాజ్‌ మాస్టర్‌ | Bigg Boss Telugu 5: Nataraj Master Says Who Is The Telugu BB 5 Winner | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: మూడు లక్షలపైచిలుకే అందుకున్నా: నటరాజ్‌

Published Thu, Oct 7 2021 5:22 PM | Last Updated on Fri, Oct 8 2021 6:07 PM

Bigg Boss Telugu 5: Nataraj Master Says Who Is The Telugu BB 5 Winner - Sakshi

గతంలోనూ పలుమార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని, ఈసారి అన్నీ కుదిరి హౌస్‌లోకి వెళ్లానని చెప్పాడు. ఇందుకోసం మూడు లక్షలపైచిలుకు పారితోషికం అందుకున్నట్లు...

Bigg Boss Telugu 5, Eliminated Contestant Natraj Master Interview: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఇటీవలే కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. నాలుగోవారానికే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసినప్పటికీ అతడి ఎలిమినేషన్‌ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొన్నాళ్లు హౌస్‌లో ఉంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరికేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే నటరాజ్‌ మాస్టర్‌ తాజాగా సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్‌ చేస్తారనుకున్నా, కానీ గొర్రె కసాయివాడినే నమ్మినట్లు కొందరు దొంగ నాటకాలు వేసేవాడినే సపోర్ట్‌ చేశారు' అని చెప్పుకొచ్చాడు.

హౌస్‌లో ఎవరు వారిలా ఉండకుండా జనాలను ఫూల్‌ చేస్తున్నారని, అలాంటి కంటెస్టెంట్లకు మాత్రమే జంతువుల పేర్లను పెట్టానని తెలిపాడు. రవి.. లహరి తన వెనకాల పడుతుందని ఇంకో లేడీ కంటెస్టెంట్‌తో చెప్పడం తప్పని విమర్శించాడు. ఇదే గుంటనక్క వేషాలంటూ అతడి పరువు తీశాడు. సిరి, షణ్ముఖ్‌, జెస్సీ ఒక బ్యాచ్‌లా కలిసి ఆడుతున్నారన్నాడు.

ఇక బరువు తగ్గే టాస్క్‌ కోసం నాలుగున్నర గంటలు వర్షంలో డ్యాన్స్‌ చేశానని, కానీ ఆ ఫుటేజీ చూపించలేదని వాపోయాడు. తనకు గతంలోనూ పలుమార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని, ఈసారి అన్నీ కుదిరి హౌస్‌లోకి వెళ్లానని చెప్పాడు. ఇందుకోసం మూడు లక్షలపైచిలుకు పారితోషికం అందుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఐదోవారం హౌస్‌లో నుంచి విశ్వ ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. శ్రీరామ్‌, మానస్‌లలో ఎవరైనా ఒకరు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచే అవకాశం ఉందని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement