బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం గర్భవతి అయిన భార్యను వదిలేసి వచ్చాడు నటరాజ్ మాస్టర్. కానీ బేబీ పుట్టే సమయానికి తను పక్కన ఉండనని లోలోపలే కుమిలిపోతున్నాడు. అలాంటి వ్యక్తికి బిగ్‌బాస్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్‌ప్రైజ్ విశేషాలు తెలియజేస్తూ ఓ ప్రోమో వదిలాడు. ఈ ప్రోమోలో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టుండి పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో కంటెస్టెంట్లు ఆగమాగం అయ్యారు. ఎవరైనా ఇంట్లోకి వస్తున్నారా? అని ఆతృతగా గేటు వంక చూశారు, కానీ ఎవరూ రాలేదు. నిజానికి ఆ పసిపాప ఏడుపులు త్వరలో నటరాజ్ మాస్టర్ ఇంట వినిపించనున్నాయి. ఈ మధ్యే ఆయన భార్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అయితే భార్యకు సీమంతం జరిగిందన్న విషయం మాస్టర్‌కు తెలియదు. ఆ శుభవార్తను బిగ్‌బాస్ వీడియోతో సహా నటరాజ్ మాస్టర్ కళ్లముందుంచాడు. భార్యను చూడగానే అతడి కళ్లు చెమర్చాయి. ఇలాంటి సమయంలో ఆమె పక్కన లేనని తల్లడిల్లిపోయాడు. ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'రోజూ రాత్రి బేబీతో మాట్లాడేవాడివి కదా, ఇప్పుడు రోజూ బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని బేబీ నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది' అని చెప్పుకొచ్చింది. ఆమె గొంతు వినగానే మాస్టర్ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment