నామినేషన్స్‌ నాకు నథింగ్‌: వాసంతి ఫైర్‌ | Bigg Boss 6 Telugu: Vasanthi Krishnan Fires On Raj | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నామినేషన్స్‌ నాకు నథింగ్‌, కానీ అది నా ప్రాణం

Oct 17 2022 10:19 PM | Updated on Oct 17 2022 10:19 PM

Bigg Boss 6 Telugu: Vasanthi Krishnan Fires On Raj - Sakshi

నాకు నామినేషన్స్‌ నథింగ్‌, కానీ నా హెయిర్‌ నాకు లైఫ్‌ అని మండిపడింది..

సందు దొరికితే చాలు నామినేషన్‌ కోసం పాయింట్లు వెతుక్కుంటారు హౌస్‌మేట్స్‌. మామూలుగానే రేవంత్‌ మీద తెగ ఓట్లు గుద్దుతారు. అలాంటిది అతడు కెప్టెన్‌ అయినప్పుడు బిగ్‌బాస్‌ రూల్స్‌ పాటించకుండా రెండుసార్లు నిద్రపోయాడు. ఇంకే, దొరికిందే ఛాన్స్‌ అనుకున్న హౌస్‌మేట్స్‌ ఇప్పుడు నామినేషన్స్‌లో ఒకటే ఓట్లు గుద్దుతున్నారు. 

మరోవైపు బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌లో రోహిత్‌, వాసంతి.. ఇద్దరిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు సెల్ఫ్‌ నామినేట్‌ కావాలన్నారు. దీనికి వాసంతి ఒప్పుకోకపోగా రోహిత్‌ ఇంటిసభ్యులందరి కోసం సెల్ఫ్‌ నామినేట్‌ అయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌ నామినేషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌కు భయపడుతున్నావ్‌ అంటూ వాసంతిని నామినేట్‌ చేయగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. నాకు నామినేషన్స్‌ నథింగ్‌, కానీ నా హెయిర్‌ నాకు లైఫ్‌ అని మండిపడింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్‌ సూర్య, గీతూ మినహా మిగతా అందరూ నామినేషన్‌లో ఉన్నారు.

చదవండి: ఏడు జన్మలుగా నీవే నా తల్లి అని సాయిబాబా అన్నారు: నటి
యాంకర్‌కు సుదీప దిమ్మతిరిగిపోయే ఆన్సర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement