హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక | Bigg Boss 7 Rathika As Lead Actress In K Raghavendra Rao's Next Movie | Sakshi
Sakshi News home page

Rathika Bigg Boss 7: స్టార్ డైరెక్టర్ సినిమాలో రతికకు హీరోయిన్ ఛాన్స్

Published Sun, Oct 15 2023 9:06 PM | Last Updated on Mon, Oct 16 2023 12:19 PM

Bigg Boss 7 Rathika Lead Actress In K Raghavendra Rao Next Movie - Sakshi

'బిగ్‌బాస్ 7' రతిక బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటివరకు గుర్తింపులేని చిన్నచిన్న పాత్రలు చేస్తి ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. బిగ్‌బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తెలుగు దర్శకుడి కొత్త సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏంటా సినిమా?

ఇప్పటివరకు తెలుగులో బిగ్‌బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ షోలో పాల్గొన్న తర్వాత ఎవరైనా కెరీర్ పరంగా బాగుపడ్డారు అంటే అది సొహైల్ మాత్రమే. ఎందుకంటే ఆ సీజన్‌లో గెలిచిన అభిజిత్‌కి కూడా ఛాన్సులు రాలేదు గానీ మనోడు మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: మెగాహీరో పుట్టినరోజు.. వాళ్లకోసం రూ.20 లక్షలు విరాళం!)

ప్రస్తుత సీజన్‌లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రతిక.. గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ గేమ్ సరిగా ఆడక బిగ్‍‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి దర్శకుడు కె.రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. స్వయంగా ఈ విషయాన్ని రతికనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు పని ఎప్పుడో అయిపోయింది. ఎందుకంటే 2017లో చివరగా సినిమా తీశారు. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ చేసేందుకు రెడీ అయ్యాడట. అందులోనే రతికకి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా? లేదా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement