Bigg Boss Telugu Season 7 Nagarjuna Remuneration Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Nagarjuna Remuneration: బిగ్‌బాస్‌ కోసం నాగార్జున రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Published Fri, Aug 18 2023 5:10 PM | Last Updated on Sun, Sep 3 2023 7:22 PM

Bigg Boss 7 Telugu: Nagarjuna Remuneration - Sakshi

మరో పదిహేను రోజుల్లో బిగ్‌బాస్‌ సందడి షురూ కానుంది. సోషల్‌ మీడియాలో నడుస్తున్న టాక్‌ ప్రకారమైతే సెప్టెంబర్‌ 3కి బిగ్‌బాస్‌ 7 ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కంటెస్టెంట్ల లెక్క ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికి కూడా సంప్రదింపులు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్‌ లిస్ట్‌ తయారయ్యేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. 

కంటెస్టెంట్లు ఎవరన్నది పక్కనపెడితే హోస్ట్‌ మాత్రం కింగ్‌ నాగార్జుననే ఉండబోతున్నాడు. వరుసగా నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయన ఐదో సీజన్‌కు కూడా తనే హోస్టింగ్‌ చేయనున్నాడు. ఇకపోతే ఆయన నాలుగో సీజన్‌ నుంచి బిగ్‌బాస్‌ షోలో కొనసాగుతున్నాడు. నాలుగో సీజన్‌కు ఆయన రూ.8-10 కోట్లు అందుకున్నాడని, ఐదో సీజన్‌కు రూ.12 కోట్ల పైచిలుకు, ఆరో సీజన్‌కు రూ.16 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఏడో సీజన్‌కు కనివనీ ఎరుగని రీతిలో రూ.200 కోట్లు తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

అయితే అది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. అసలే ఆరో సీజన్‌ పెద్దగా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోకపోగా అట్టర్‌ ఫ్లాప్‌ అన్న ట్యాగ్‌ మూటగట్టుకుంది. ఈ సమయంలో నాగ్‌ ఇంత భారీ మొత్తం డిమాండ్‌ చేసే ఛాన్సే లేదు. ఈ సీజన్‌కు అతడు రూ.20 కోట్ల మేర మాత్రమే తీసుకునే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అనవసరంగా నాగ్‌ గురించి లేని పోని రూమర్‌ సృష్టిస్తున్నారని హర్ట్‌ అవుతున్నారు కింగ్‌ ఫ్యాన్స్‌.

చదవండి: జైలర్‌ సినిమాలో మెగాస్టార్‌ ఉండాల్సిందట.. రజనీకాంతే వద్దని ఫోన్‌ చేసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement