బిగ్‌బాస్ షోకు మకుటం లేని మహారాజు నాగార్జున అక్కినేని. నవ్వుల బాణాలు విసిరే ఈ మన్మథుడు అవసరమైనప్పుడు కోపతాపాలు ప్రదర్శించడం వచ్చూ. ఎదుటివాడి తప్పులను వేలెత్తి చూపి వారిని సరిదిద్దడమూ వచ్చు. తన స్టార్‌డమ్‌న పక్కనపెట్టి కంటెస్టెంట్లతో చనువుగా కలిసిపోవడమూ వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సుగుణాలు, మరెన్నో ప్రత్యేకతలు ఆయన సొంతం. నాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ మూడో సీజన్‌ను విజయవంతం అయిందంటే అందులో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఇక ఈ సారి కూడా ఆయన బిగ్‌బాస్ నాల్గో సీజన్‌తో సందడి చేస్తున్నారు. కరోనా వైపరీత్యం వల్ల వినోదం లేక బోసిపోతున్న ఇళ్లలో వినోదాల వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: అవినాష్.. నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా)
చిరంజీవికి కరోనా, ఉలిక్కిపడ్డ బిగ్‌బాస్
ఆయితే అన్ని రోజులు మనవి కావు. నాగార్జునకు బిగ్‌బాస్ ఎంత ముఖ్యమో సినిమాలూ అంతే ముఖ్యం. ఈ క్రమంలో మనాలీ షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో నాగ్ దసరా మెగా ఎపిసోడ్‌కు హోస్ట్ రాలేదు. ఆయన స్థానంలో నాగ్ కోడలు సమంత వచ్చింది. తొలిసారి హోస్టింగ్ అయినప్పటికీ చిలిపి నవ్వుతో, చనువు మాటలతో, అందరినీ చదివేసినట్లు ప్రవర్తించడంతో సామ్ హోస్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో పండగ వస్తోంది. అదే దీపావళి. ఇంతలో చిరంజీవికి కరోనా రావడంతో బిగ్‌బాస్ టీమ్ ఉలిక్కిపడింది. చిరుకు కరోనా రావడానికి ముందు నాగార్జునతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో ఫేస్‌మాస్క్ కూడా పెట్టుకోకుండా మీడియా కంట పడ్డారు. (చదవండి: టీఆర్పీలో నాగ్‌ను మించిపోయిన సమంత)
అప్పుడు కోడలు, ఇప్పుడు కొడుకు
ఆ తర్వాత 'ఆచార్య' షూటింగ్‌కు ముందు మెగాస్టార్ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం, పాజిటివ్ అని తేలడం చకాచకా జరిగిపోయాయి. దీంతో నాగార్జున స్వీయనిర్బంధంలో ఉండి ఈ పండగకు డుమ్మా కొడతారేమోనని అందరూ అనుమానపడ్డారు. కానీ ఈ భయాలేమీ అవసరం లేదు. నాగార్జున కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చిందట. దీంతో ఎప్పటిలాగే వీకెండ్ ఎపిసోడ్‌కు నాగ్ హోస్ట్ చేయనున్నారు. అయితే తాజాగా నెట్టింట మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీపావళి ఎపిసోడ్‌కు నాగ్ తనయుడు, హీరో నాగ చైతన్య తన కొత్త సినిమా 'లవ్ స్టోరీ' కోసం ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నాడట. అప్పుడు కోడలు సమంత, కొడుకు అఖిల్ స్టేజీమీద హంగామా చేయగా ఇప్పుడు మిగిలిన చైతన్యను కూడా రంగంలోకి దింపుతున్నారని నెటిజన్లు గుసగుసలు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment