
Bigg Boss Telugu 5: Akhil Sarthak Support to Against Trolls for Shanmukh: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 13 వారంలోకి అడుగు పెట్టింది. యాంకర్ రవి ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారో ఊహించడం కష్టంగా మారింది. ఎందుకంటే అది బిగ్‌బాస్ హౌస్.. అక్కడేమైనా జరగొచ్చు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ల పోట్లాటల కన్నా వాళ్ల అభిమానుల కొట్లాటలే ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొందరు తమకు నచ్చని కంటెస్టెంట్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారు.
తాజాగా ఓ యూట్యూబర్ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నును ఎక్కడో చూసినట్లుంది... పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్ నీలాగే ఉంటడు షణ్ను..' అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గత సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ ఘాటుగా స్పందించాడు. 'ఇంతకు ముందు మీ మీద గౌరవం ఉండేది, ఇప్పుడది పోయింది. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పు! ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి! ఇది ఒక గేమ్ షో మాత్రమే.. చూసి ఎంజాయ్ చేయండంతే! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో! వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి' అని చురకలంటించాడు.
'మీకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం అవతలి వారిని కించపరచడం చాలా తప్పు. రోడ్ల మీద చిత్తుకాగితాలు ఏరుకునేవాళ్లలా ఉంది నీ ఫేసు.. అంటే వాళ్లు మనుషులు కాదా ఏంటి? మరీ ఇంతలా విమర్శించడం దేనికి బ్రదర్? నీ ఈగో సంతృప్తి చెందడానికా! రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు సచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ.. ముఖం చూసి నువ్వు సపోర్ట్ చేస్తావేమో కానీ అందరూ అలా కాదు. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్ షోను గేమ్ షోలా మాత్రమే చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై షణ్ను ప్రేయసి దీప్తి సునయన సైతం రియాక్ట్ అయింది. షణ్ను కోసం స్టాండ్ తీసుకున్నందుకు అఖిల్‌కు థ్యాంక్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment