టాలీవుడ్‌ కింగ్‌ నాగ్‌ ధరించిన షర్ట్‌ అన్ని లక్షలా? | Bigg Boss Telugu 7: Do You Know How Much The Cost Of King Nagarjuna Wears Louis Shirt, Deets Inside - Sakshi
Sakshi News home page

Nagarjuna Akkineni: బిగ్‌బాస్‌ 7 మినీ లాంచ్‌లో నాగ్‌ వేసుకున్న షర్ట్‌ ధరెంతో తెలుసా?

Published Mon, Oct 9 2023 12:55 PM | Last Updated on Wed, Oct 11 2023 11:08 AM

Bigg Boss Telugu 7: Nagarjuna Wears Louis Shirt, Do You Know How Much Cost? - Sakshi

రియాలిటీ షోలకు బాస్‌.. బిగ్‌బాస్‌. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ కొనసాగుతోంది. ఈసారి డిఫరెంట్‌గా రెండుసార్లు లాంచింగ్‌ పెట్టారు. మొదటి సారి 14 మందిని హౌస్‌లోకి పంపించారు. అందులో ఐదుగురు ఎలిమినేట్‌ అవ్వగానే రెండోసారి మినీ లాంచ్‌ పెట్టారు. ఈసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. పేరుకు మినీ లాంచ్‌ కానీ చాలా గ్రాండ్‌గానే చేశారు. సిద్దార్థ్‌, రవితేజ వంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేశారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున వేసుకున్న షర్ట్‌ చాలామందికి భలే నచ్చేసింది. దీంతో దాని ధర ఎంతుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అని జనాలు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఇది లూయిస్‌ వ్యూటన్‌ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్‌. దీని ధర ఎంతో తెలిస్తే గుడ్లు తేలేస్తారు. ఈ చొక్కా ఖరీదు వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లోనే ఉంది.

నాగ్‌ ధరించిన ఈ స్టైలిష్‌ షర్ట్‌ ధర రూ.2 లక్షల పై చిలుకు ఉంది. ఇది చూసిన అబ్బాయిలు.. ఇలాంటివి చూసి ఆనందించాలంతే కానీ, కొనుక్కోవాలని ఆశపడకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. అటు నాగ్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. మరి షో హోస్ట్‌ అంటే మినిమమ్‌ మెయింటైన్‌ చేయాలిగా, అయినా మన్మథుడు ఏ డ్రెస్‌ వేసినా బాగుంటాడు అని చెప్పుకొస్తున్నారు.

చదవండి: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌ ప్రక్రియ.. అమర్‌, తేజలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement