టైటిల్: విద్యార్థి
నటి నటులు: చేతన్ చీను, బన్నీ వోక్స్, టిఎన్ఆర్, నవీన్ నేని, రఘుబాబు, జీవా, మణిచందన, అరుణ్, యాదమ్మ రాజు తదితరులు...
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: కన్నా పిసి
డైలాగ్స్: నవీన్ కోలా, మధు మాదాసు
నిర్మాత: ఆళ్ల వెంకట్ (AV)
రచన, దర్శకత్వం: మధు మాదాసు
విడుదల తేదీ: 29.04.2023
చేతన్ చీను, బన్నీ వోక్స్ జంటగా నటించిన చిత్రం 'విద్యార్థి'. మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్(AV) నిర్మాత గా 'మధు మాదాసు' దర్శకత్వం వహించారు. ఇప్పటికే, రీలిజ్ అయిన ట్రైలర్, విజయ్ బుల్గానిన్ అందించిన సాంగ్స్ ప్రేక్షకకులని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ, కొత్త కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం.
అసలు కథేంటంటే:
మహాలక్ష్మి(బన్నీవోక్స్) బాపట్లలోని పలుకుబడి కుటుంబంలో పుట్టి పెరిగిన 'భూపతి' గారి ఏకైక బంగారు కూతురు. చైతన్య(చేతన్ చీను) అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ ఒక అనాథ. మహాలక్ష్మి, చైతన్య ఒకే క్లాస్‌మేట్స్ కావడంతో, ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక పక్క పాత గాయాలతో రగిలిపోతున్న సత్యం, 'భూపతి' పై పగతో 'మహాలక్ష్మి' పై ఎటాక్ చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య పోరాటంలో చైతన్య(చేతన్ చీను) ఎంతగానో ప్రేమించిన 'మహాలక్ష్మి' ప్రేమని కాపాడుకోగలిగాడా? అలాగే, తన ప్రేమని పెద్దలు పూర్తిగా అంగీకరించారా? అసలు, రఘుబాబు పాత్ర ఏంటి? ఇవ్వన్నీ తెలియాలి అంటే, సినిమా చూడాల్సిందే.
కథ ఎలా సాగిందంటే..
ప్రతి ప్రాంతంలో కుల, మత వ్యవస్త గొడవలు తరతరాలుగా చూస్తూ వస్తున్నాం. ఇలాంటి, సున్నితమైన అంశాన్నే 'మధు మాదాసు' దర్శకుడు తనదయిన స్టైల్లో 'కుల మతాలు' పిచ్చి వల్ల ఎంత మంది అమాయకులు బలి అవ్వుతున్నారో కళ్ళకు కట్టినట్టు గా చూపించడంలో సక్సెస్ అయ్యారో లేదో తెలుసుకుందాం.సినిమా ఓపినింగ్లోనే డైరెక్టర్ 'స్టోరీ బోర్డు' ద్వారా కథని చెప్పిన తీరు బాగుంది. ఇంట్రడక్షన్ సాంగ్ లో స్టూడెంట్స్ యెక్క ఆలోచన తీరు చెప్తూ, మహాలక్ష్మి(బన్నీవోక్స్) ఎంట్రీ కాలేజీ లో రివీల్ చేస్తారు. కాలేజ్ లో చైతన్య(చేతన్ చీను), మహాలక్ష్మి(బన్నీవోక్స్) మధ్య సాగే లవ్ సాంగ్స్ అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెర మీద ఆకట్టుకుంటుంది.
కాలేజ్లో టిఎన్ఆర్ & చైతన్య(చేతన్ చీను) మధ్య సాగే కొన్ని సంభాషణలు, డైలాగ్స్ కంటతడి తెప్పిస్తాయి. అక్కడక్కడ వచ్చే 'యాదమ్మ రాజు' కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, స్టూడెంట్స్ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. కొన్ని చోట్ల, సీన్స్ ల్యాగ్ అయ్యినప్పటికీ డైరెక్టర్ కదాంశంతో చక్కగా రాణించారు. డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు గా క్లైమాక్స్ లో సీన్స్ ని చిత్రీకరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే...
హీరో చేతన్ చీను ప్రతి సీన్స్ లో ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం. అంతే కాదు, ప్రతి సీన్స్ లో రాయల్టీ అండ్ డిగ్నిఫైడ్ గా తెర మీద చక్కగా చూపించారు. బన్నీ వోక్స్ ని మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు. ఈ ముద్దు గుమ్మా యాక్టింగ్ చాలా సెటిల్డ్ గా పెర్ఫామెన్స్ తో అదరకొట్టింది. నవీన్ నేని, యాదమ్మ రాజు, రఘు బాబు, టిఎన్ఆర్ వీళ్ళ నిడివి తక్కువే అయ్యినప్పటికీ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తదితరులు తమ పరిధి మేరకు ప్రతి ఒక్కరు బాగా రాణించారు.
సాంకేతికత విషయానికి వస్తే.. డైరెక్టర్ 'మధు మాదాసు' ఇలాంటి కథ ని ప్రేక్షకులకి అందించినందుకు ముందుగా అభినందనలు. అలాగే, బడ్జెట్ కి అనుగుణంగా 'కథ' ని ఎక్జ్యుక్యూట్ చేసిన విధానం బాగుంది. బొంతల నాగేశ్వర రెడ్డి 'ఎడిటింగ్' కట్ చాలా బాగుంది. 'విజయ్ బుల్గానిన్' అందించిన మ్యూజిక్ ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. అంతే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. 'కన్నా పిసి' అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment