అనంతపురం అర్బన్: రియాలిటీ షోగా చెబుతున్న ‘బిగ్‌బాస్’ లైసెన్స్ పొందిన అనైతిక షో అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన హీరో నాగార్జున ఇలాంటి షోకు యాంకరింగ్ చేయడం అవమానకరమన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు.
చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే?
సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలకు అనంతపురం వచ్చిన ఆయన శనివారం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. బిగ్‌బాస్ అనే లైసెన్స్ పొందిన షోలో 100 మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటోందన్నారు. దీన్ని ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. షో నిలిపేయాలంటూ తాము డిజిటల్ క్యాంపెయిన్ చేపడుతున్నామన్నారు. సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మడం నేరమని స్పష్టం చేశారు. అఖండ, భీమ్లా నాయక్ కేవలం వినోదాత్మక సినిమాలే తప్ప.. వాటిలో సందేశం ఏమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment