
వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్‌తో ‘అ!’ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ హీరోగా అతడు తెరకెక్కించిన ‘కల్కీ’ చిత్రం కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ఇటీవల ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది.
తెలుగులో జాంబీ జానర్‌లో వచ్చిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా కొత్త థ్రిల్ అందించింది. తన డెబ్యూ చిత్రం అ!కు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఆయన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ సీక్వెల్ ఆగిపోయినట్లు ఆయన ప్రకటించాడు. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, దీనిని ఓ బాలీవుడ్ స్టార్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని అనుకున్నట్లు చెప్పాడు. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా ఓకే అయిందనుకుంటుండగా అతడు షాక్ ఇచ్చాడని, ఆ స్టార్ ఈ మూవీ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నట్లు చెప్పడంతో ‘అ2’ సినిమా వెనక్కి వెళ్లిందని ఆయన వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment