'Do Patti' starring Kajol and Kriti Sanon, goes on floors - Sakshi
Sakshi News home page

కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది

Published Mon, Aug 21 2023 4:00 AM | Last Updated on Mon, Aug 21 2023 10:41 AM

Do Patti starring Kajol and Kriti Sanon, goes on floors - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్  కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్‌ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక.

ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్  నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు 2015లో షారుక్‌ ఖాన్  హీరోగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్  కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్‌లో జాయిన్  అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement