పై ఫోటోలో గుండుతో కనిపిస్తున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ తెలుగు చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్‌గా నటించింది. కొరియోగ్రాఫర్‌గా ఎక్కువ సినిమాలు చేసిన ఈమె దర్శకనిర్మాతగానూ పని చేసింది. మధ్యలో తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. ఈమె చివరగా 2021లో వచ్చిన రంగ్‌దే సినిమాలో హీరో సోదరిగా నటించింది.
ఆవిడే గాయత్రి రఘురామ్. రేపల్లెలో రాధ(2001) అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ తనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం మా బాపు బొమ్మకు పెళ్లంట(2003) సినిమా! ఇందులోని 'మాటలే రాని వేళ పాట ఎలా పాడను..' సాంగ్ చాలా పాపులర్. ఎవరైనా తీవ్ర బాధలో కూరుకునిపోయి ఉంటే ఇప్పటికీ ఈ పాట వింటూ ఉంటారు. ఇందులో తన నటనతో కన్నీళ్లు పెట్టించిన గాయత్రి అప్పటికే సౌత్‌లో అనేక భాషల్లో నటించింది. అయితే ఇంత పాపులారిటీ సంపాదించినప్పటికీ 2004 నుంచి 2010 వరకు ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.
హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ తర్వాత కొన్ని ప్రత్యేక పాటల్లో మెరుపు తీగలా కనిపించి వెళ్లిపోయేది. సహాయక పాత్రల్లోనూ నటించింది. అయితే హీరోయిన్‌గా కంటే కొరియోగ్రాఫర్‌గానే బోలెడు సినిమాలు చేసింది గాయత్రి. రంగ్‌దే రిలీజ్ తర్వాత సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించింది. 2006లో దీపక్ చంద్రశేఖర్‌ను పెళ్లాడిన ఆమె 2010లో విడాకులిచ్చింది. 2014లో బీజేపీలో చేరగా ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. ఈ హీరోయిన్ ఆగస్టు నెల ప్రారంభంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆ సమయంలోనే స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంది. ఈ క్రమంలోనే గుండుతో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
చదవండి: రీతూ బ్రేకప్ ఉత్తిదేనా? శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్..
Comments
Please login to add a commentAdd a comment