సందీప్ కుమార్, దీప్తి వర్మ జంటగా నటించిన సినిమా 'ద్రోహి'. విజయ్ పెందుర్తి దర్శకుడు. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్‌నెస్ డే ఎంటర్‌టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్లలోకి రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!)
అక్టోబర్ 13న మల్టీపెక్స్‌ల్లో రూ.112లకే ఈ సినిమా టికెట్ దొరుకుతుందని చిత్రబృందం పేర్కొంది. హీరో త్రిగుణ్.. ఆదివారం జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉందని, దర్శకుడి పనితీరు ట్రైలర్‌లో కనిపించిందని అన్నాడు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment