
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లిన మిల్కీ బ్యూటీ బాలీవుడ్ నటుడితో ముద్దుల్లో మునిగిపోయినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై పెద్దఎత్తున రూమర్స్ హల్ చల్ చేశాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
(ఇది చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో మిల్కీ బ్యూటీ.. అతనితో డేటింగ్ నిజమేనా?)
అయితే ఈ వార్తలపై తమన్నా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలపై మండిపడుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు?’, ‘వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని మీకు చెప్పారా?’, ‘చాలా ఎంతోకాలం నుంచి మంచి స్నేహితులు.. కలిసి పార్టీలకు వెళ్తే తప్పేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. వారు తమ రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించే వరకూ ఆగితే బాగుంటుందని' సోషల్‌మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అసలు విజయ్ వర్మ ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన విజయ్ వర్మ నటనపై ఉన్న ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పింక్’, ‘గల్లీబాయ్’, ‘సూపర్ 30’, ‘భాఘి 3’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో నాని హీరోగా తెరెకెక్కించిన ‘ఎంసీఏ’లో విలన్‌గానూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment