
గుల్లు దాదా, తబర్, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ". షాన్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మహమ్మద్ మైను ఖాన్ డైరెక్షన్‌లో మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ నిర్మించారు. ఒలి మహమ్మద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా జనవరి 6న విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ మాట్లాడుతూ.. 'నూతన సంవత్సరం కానుకగా రిలీజ్ అయిన మా ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. హైదరాబాదీ సినిమాగా అన్ని ఏరియాల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మేం ఊహించని స్పందన లభించింది. హీరోహీరోయిన్ల నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్య వాదములు' అన్నారు.
చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్, చిరుకు మాస్ మహారాజ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment