
Gandi Baat Actress Neha Paul About Her Acting Training Journey: రంగుల ప్రపంచంలో నటించే అవకాశం రావడం లాటరీ లాంటిది. అలాంటి లాటరీలు వరుసగా వస్తున్నా తిరస్కరించింది నేహా. తెలియకుండా నటించడం కంటే.. శిక్షణ తీసుకొని నటించడం మేలు అంటూ ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా తెరంగేట్రం చేసింది.. వెబ్‌స్టార్‌గా వెలుగుతోంది. పుట్టింది పంజాబ్‌లో. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆమె విద్యాభ్యాసమంతా వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. కాలేజీ రోజుల్లో మోడల్‌గా ఉన్న ఓ ఫ్రెండ్ ప్రోత్సాహంతో తానూ పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది.
ఆ ఆసక్తితోనే చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు అడుగులు వేద్దామనుకుంది, కానీ, కాలం ఆమెను నటిగా నిలబెట్టింది. 2015లో ‘రాణి’ అనే టీవీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది అనుకోకుండా. అది మంచి విజయం సాధించడంతో వరుస చాన్స్‌లు క్యూ కట్టాయి. అయితే, అన్నింటినీ తిరస్కరించింది. తన ప్రతిభను ప్రేక్షకులు మెచ్చినా.. తనకు సంతృప్తి నివ్వలేదు. ఏదో తెలియని లోటు తన నటనలో కనిపించింది ఆమెకు.
అందుకే కొంతకాలం యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకొని, సంవత్సరం పాటు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసింది. తర్వాతే బుల్లి తెర అవకాశాలను అందుకుంది. ‘గంగా’ , ‘ప్రేమ’ అనే సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత వెబ్ స్క్రీన్ మీదా అప్పియరైంది ‘గందీ బాత్’ అనే సిరీస్‌తో. 'చేసే ప్రతి పనికి క్రమశిక్షణతో పాటు వందశాతం క్వాలిటీ ఉండాలని మా నాన్న చెప్పేవారు. అందుకే ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చా.' అని చెప్పుకొచ్చింది నేహా పాల్.
Comments
Please login to add a commentAdd a comment