నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘మాయి (mai)’ సిరీస్ చూసినవారెవరైనా వామికా గబ్బీని మరచిపోలేరు. మూగ అమ్మాయిగా ఆమె కనబరచిన నటన అలాంటిది మరి. ‘లాంగ్వేజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా ఆమెకు పేరు. వామికా గురించి మరిన్ని వివరాలు..
► పుట్టింది, పెరిగింది చండీగఢ్‌లో. తండ్రి.. గోవర్ధన్ గబ్బీ.. పంజాబీ సినిమా స్క్రిప్ట్ రైటర్. తల్లి రాజ్‌కుమారి.. టీచర్.
► కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఎనిమిదవ యేటనే ‘సౌదా దిలా దే’ అనే పంజాబీ టీవీ సీరియల్‌తో నటనారంగంలోకి ప్రవేశించింది.
► డిగ్రీలో ఉన్నప్పుడే మోడలింగ్ చేసింది. ఓ డాన్స్ షో ద్వారా పంజాబీ సినిమారంగంలో అవకాశం దొరికింది.
► జబ్ వి మెట్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, దీపికా జంటగా నటించిన లవ్ ఆజ్ కల్‌లోనూ కనిపించింది వామికా. నిన్నటి తాజా చిత్రం ‘83’లోనూ నటించింది.
► హీరోయిన్‌గా చక్కటి అవకాశాలు ఇచ్చింది దక్షిణాది చిత్రపరిశ్రమే. తెలుగులో భలే మంచి రోజులో చేసింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది.
► ఆమె తొలి వెబ్‌సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లోని గ్రహణ్. ఇటు పంజాబీ, హిందీ, దక్షిణాది చిత్రాలు, అటు వెబ్‌సిరీస్ చేస్తూ బిజీగా ఉంటోంది.
► వామికా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. పుస్తకాలు చదవడం, డాన్స్, ప్రయాణాలు ఆమె అభిరుచులు.
ఏ నటి, నటుడికైనా భిన్నమైన పాత్రలు పోషించాలనే ఉంటుంది. నాదీ అదే లక్ష్యం. అయితే సంజయ్‌లీలా భన్సాలీ దేవ్‌దాస్‌లోని ఐశ్వర్య రాయ్ పోషించిన పార్వతి పాత్ర నా డ్రీమ్ రోల్!
– వామికా గబ్బీ
చదవండి: ఆ ఇద్దరు హీరోల యాక్టింగ్ అంటే చాలా ఇష్టం
పాట కోసం అన్ని లక్షలు ఖర్చుపెట్టాం, కానీ లీక్ చేయడంతో బాధేసింది
Comments
Please login to add a commentAdd a comment