విజయ్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తా.. ప్రకటించిన స్టార్‌ హీరోయిన్‌ | A Glamor Doll Who Wants To Contest Against Vijay In The Elections | Sakshi
Sakshi News home page

విజయ్‌పై పోటీ చేస్తానంటున్న గ్లామర్‌ డాల్‌

Published Fri, Apr 12 2024 5:56 PM | Last Updated on Fri, Apr 12 2024 6:55 PM

A Glamor Doll Who Wants To Contest Against Vijay In The Elections - Sakshi

'తమిళగ వెట్రిక్‌ కళగం' పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టారు దళపతి విజయ్. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌ పార్టీ పెట్టిన సమయం నుంచి తమిళనాట రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. 2026 ఎన్నికల్లో గట్టిపోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్‌పై తాను పోటీ చేస్తానని సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రకటించేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  గ్లామర్ డాల్ నమిత.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మీద పోటీ చేస్తానని ప్రకటించింది. నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆమె ఉంది. నీలగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎల్‌ మురుగన్‌ పోటీ చేస్తుండటంతో ఆయన తరపున  నమిత ఎన్నికల ప్రచారం చేస్తుంది. దీంతో నమితను చూసేందుకు భారీగా జనాలు ఎగబడుతున్నారు. నమితకు తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసం ఏకంగా అభిమానులు గుడి కూడా కట్టించారు.

ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో తాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటీ చేస్తానని చెప్పిన నమిత.. విజయ్‌ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంది. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేయాలని, అప్పుడే రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నట్లు నమిత తెలివిగా సమాధానం చెప్పింది. హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే  డిపాజిట్లు కూడా ఆమెకు దక్కవని ఫ్యాన్స్‌ అంటున్నారు. దీంతో నమిత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement