
సాక్షి, విశాఖపట్నం: హీరో మంచు విష్ణుకు విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ తగిలింది. తన మూవీ ప్రమోషన్లో భాగంగా విశాఖ వెళ్లిన విష్ణును నగరంలో నోవాటెల్ హోటల్ వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. విశాఖకు సినీ ప్రముఖులు ఎవరూ వచ్చిన ఇలాగే అడ్డుకుంటామని, టాలీవుడ్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ విష్ణుకు ఉద్యోగులు, నిరసన కారులుల వినతి పత్రం అందజేశారు.
ఇక దీనిపై విష్ణు స్పందిస్తూ.. ప్రైవేటు వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు ప్రభాత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించాడు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారని అన్నాడు. దీనిపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని విష్ణు నిరసన కారులతో పేర్కొన్నాడు. కాగా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన నిరసనకు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment