ఈ ఫొటోలోని నటిని చూడగానే ఓ తెలుగు సినిమా గుర్తొచ్చుండాలి కదా! అవును..మీరనుకుంటున్నది కరెక్టే.. ‘నా బంగారు తల్లి’ సినిమానే! ఆమె పేరు అంజలి పాటిల్. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఆమే ఓ చిరునామా! ఇటు సిల్వర్ స్క్రీన్.. అటు వెబ్ స్క్రీన్.. రెండింటిలోనూ తన అప్పియరెన్స్‌ను స్థిరం చేసుకుంది. మరిన్ని వివరాలు..
► అంజలి పుట్టింది, పెరిగింది మహారాష్ట్రలోని నాసిక్‌లో. పుణె యూనివర్సిటీ సెంటర్ ఫర్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకుంది. తర్వాత ఢిల్లీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్‌డీ)లోనూ చేరి దర్శకత్వంలో శిక్షణ పొందింది.
► మన దేశంలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చిన సినిమా ‘డెల్హీ ఇన్ ఎ డే’. దీంతో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది.
► అయితే కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం మాత్రం ప్రకాశ్ ఝా ‘చక్రవ్యూహ్’. ఇందులో ఆమె మావోయిస్ట్ నేత జుహూగా నటించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అన్నీ అలాంటి పాత్రలే రావడంతో అన్నిటినీ తిరస్కరించింది.
► ఎన్నెస్‌డీలో ఉన్నప్పుడే అంజలి నటనా కౌశలం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తొలి సినిమా అవకాశం కూడా విదేశాల నుంచే వచ్చింది. అది శ్రీలంకన్ చిత్రం.. విత్ యూ.. వితవుట్ యూ (దర్శకుడు ప్రసన్న విథంజే). అన్నట్టు అంజలి బౌద్ధమతాన్ని పాటిస్తుంది.
► అంజలి నటే కాదు.. నిర్మాత కూడా..‘గ్రీన్ బ్యాంగిల్స్’ అనే మూవీతో.
► సినిమా తెర మీదే కాదు ‘మై డియర్ ప్రైమ్ మినిస్టర్’, ‘మై క్లయింట్ వైఫ్’, ‘మేరీ నిమ్మో’, ‘కౌన్ ప్రవీణ్ తాంబె’ వంటి వెబ్ మూవీస్‌లోనూ తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది.
► పుస్తకాలు, ప్రయాణాలంటే ఇష్టం. నిజానికి నేను నటిని కావాలని అనుకోలేదెప్పుడు. నేను శిక్షణ తీసుకుంది కూడా దర్శకత్వంలో. యాక్సిడెంటల్‌గా యాక్ట్రెస్‌నయ్యాను.
– అంజలి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment