Actress Tamannaah Bhatia Launched The Legend Telugu Trailer Deets Here - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: ‘ది లెజెండ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ చేసిన తమన్నా

Published Mon, Jul 18 2022 12:23 PM | Last Updated on Thu, Jul 21 2022 11:57 AM

Heroine Tamannah Launched The Legend Telugu Trailer - Sakshi

లెజెండ్‌ శరవణన్‌  హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్‌’. జేడీ–జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా హీరోయిన్‌. న్యూ లెజెండ్‌ న్యూ శరవణ స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన ఈ తమిళ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్‌పై తిరుపతి ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని హీరోయిన్‌ తమన్నా విడుదల చేశారు.

‘‘విదేశాల్లో మైక్రోబయాలజీ డాక్టరేట్‌ పూర్తి చేసి దేశ ప్రజలకు సేవ చేసేందుకు తన స్వగ్రామానికి వస్తాడు శాస్త్రవేత్త శరవణన్‌. ఇక్కడ ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సవాళ్లని ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్రకథ. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్‌, కామెడీ.. ఇలా కమర్షియల్‌ అంశాలన్నీ ఉన్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. సుమన్, నాజర్, విజయ్‌ కుమార్, ప్రభు, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్‌ జయరాజ్, కెమెరా: ఆర్‌. వేల్‌రాజ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement