
వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది హనీరోజ్. వాస్తవానికి ఈ కేరళ ముద్దుగుమ్మ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శివాజీ హీరోగా నటించిన ‘ఆలయం’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’లోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు హనీరోజ్‌కి టాలీవుడ్‌లో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీతో హనీరోజ్‌కి ఫేమస్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
ప్రస్తుతం హనీరోజ్ ఏం మాట్లాడినా.. అది వైరల్‌గా మారుతోంది. తాజాగా విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్‌కి వెళ్లి న హనీ.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని.. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. అయితే వరుడు ఎవరు.. ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుతం హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.