
తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాలని ఆశించానన్నారు. అయితే అది జరగకపోయినా ఇన్నాళ్లకు తాను సొంతంగా నిర్మిస్తున్న చిత్రం..
తన కల ఇప్పటికి.. నెరవేరిందని దర్శకుడు సుశీగణేషన్ అన్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో 4వీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వంజం తీర్తాయడా. 1980 ప్రాంతంలో మదురైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడం విశేషం.
దీని గురించి దర్శకుడు తెలుపుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాలని ఆశించానన్నారు. అయితే అది జరగకపోయినా ఇన్నాళ్లకు తాను సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆ కల నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. వంజం తీర్తాయడా చిత్రంలో సంగీతం ఒక పాత్రలా ఆద్యంతం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు.