తనను పొగిడేందుకు డబ్బులిస్తున్న హీరోయిన్‌.. జాన్వీ ఏమందంటే? | Janhvi Kapoor Reacts On Claims Of Paying Money For Praising Her, Deets Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పొగడ్తలకు డబ్బులు... జాన్వీ కామెంట్‌ ఏంటంటే?

Jul 26 2024 12:15 PM | Updated on Jul 26 2024 1:27 PM

Janhvi Kapoor Reacts on Claims of Paying Money for Praising Her

జాన్వీ కపూర్‌.. ఈ మధ్య బాగా వైరలవుతున్న పేరు. హిందీలో డిఫరెంట్‌ సినిమాలు, తెలుగులో వరుస ఆఫర్లు, అంబానీ పెళ్లిలో డ్యాన్సులు.. ఇలా ఏదో ఒక విధంగా జాన్వీ కపూర్‌ పేరు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. దివంగత నటి శ్రీదేవి పేరును నిలబెట్టేందుకు కూతురిగా బాగానే కష్టపడుతోంది. ఈ క్రమంలో తను ఎంచుకుంటున్న స్క్రిప్టులకు, నటనకు ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాను డబ్బులిచ్చి మరీ పొగిడించుకుంటోందని కొందరు నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.

పొరపాటున పొగిడినా..
ఉలజ్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ ఈ ప్రచారంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను మీ అందరి ముందు కూర్చుని నా గురించి నేను ఏమని చెప్పుకోవాలి? నాపై నాకు చాలా నమ్మకముంది.. అద్భుతంగా నటిస్తున్నానని చెప్పాలా? అలా సొంత డప్పు కొట్టుకోవడం నా వల్ల కాదు. జనాలే నా పర్ఫామెన్స్‌ను జడ్జ్‌ చేయాలి. అయితే సోషల్‌ మీడియాలో కొందరు నన్ను పొరపాటున పొగిడితే చాలు.. వాళ్లకు నేను డబ్బులిస్తున్నానని కామెంట్స్‌ చేస్తున్నారు. వాళ్లేమీ నా పీఆర్‌ కాదు. డబ్బు ఇచ్చి మరీ పొగిడించుకునేంత బడ్జెట్‌ నా దగ్గర లేదు' అని చెప్పుకొచ్చింది.

సినిమా..
కాగా జాన్వీ కపూర్‌ చివరగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఉలజ్‌ మూవీ ఆగస్టు 2న విడుదల కానుంది. మరోవైపు తెలుగులో దేవర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రామ్‌చరణ్‌తోనూ ఓ చిత్రంలో జోడీ కడుతోంది.‌

చదవండి: నాకు పెళ్లయిందన్న విషయమే మర్చిపోయా: తాప్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement