టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కొరటాల శివ మూవీ షూటింగ్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన భార్య లక్ష్మి ప్రణతి, చిన్న కుమారుడు భరత్ రామ్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
ఇందులో ప్రణతి కొడుకు భరత్ రామ్ ఎత్తుకుని కనిపించారు. ఈ పొటో చూస్తుంటే ప్రణతి, భరత్‌ను ఆడించేందుకు కిడ్స్ గేమ్ జోన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తానికి ఇలా తమ అభిమాన హీరో తనయుడిని చూశాం అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. భరత్ చాలా క్యూట్‌గా ఉన్నాండంటూ ఈ ఫొటోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా తారక్ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుంటాడు. అభయ్ రామ్, భరత్ రామ్‌లతో కలిసి సరద సమయాన్ని గడుపుతుంటాడు. అయితే ఎన్టీఆర్ తన కుటుంబ, వ్యక్తిగత విషయాల్లో గొప్యత పాటిస్తుంటాడు.
చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత
ఇతర హీరోల మాదిరిగా ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి మూవీ ఈవెంట్స్‌కు హజరవ్వడం, అలాగే సోషల్ మీడియాలో తనయుల ఫొటోలు షేర్ చేయడం చాలా అరుదు. చెప్పాలంటే కుటుంబాన్ని మీడియా కెమెరాకు దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే తన పిల్లలకు ఫ్రీడం ఉండాలని, పబ్లీక్, మీడియా వల్ల వారు ఇబ్బంది పడకూడదనే ఇలా చేస్తుంటాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలో భార్య లక్ష్మి ప్రణతి, చిన్న కుమారుడు భరత్ రామ్ ఫొటోల ఇలా నెట్టింట దర్శనం ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment