Kacha Badam Singer Bhuban Badyakar Receives Rs 3Lakhs: కచ్చా బాదమ్.. ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తున్న సాంగ్ ఇది. సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హుషారైన స్టెప్పులతో మిలియన్ల కొద్దీ జనం ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ పాటను క్రియేట్ చేయగా.. దానికి 'గోధూలిబేల మ్యూజిక్' కంపెనీ రీమిక్స్ వెర్షన్‌ను జోడించి సోషల్ మీడియలోకి వదిలారు. అంతే ఈ పాటకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అంతలా ఫేమస్ అయిపోయింది.
ఈ పాట ఒరిజినల్ క్రియేటర్ పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన ఆయన ఓ చిరు వ్యాపారి భుబన్ బద్యాకర్. గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తన పల్లీలు కొనేలా జనాలను ఆకర్షించేందుకు ఇలా సొంతంగా తానే లిరిక్స్ రాసుకుని పాడారు. అంతే ఈ కచ్చాబాదమ్ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు బద్యాకర్. అయితే ఈ సాంగ్ ఇంత సెన్సేషన్‌గా మారినా అతను ఆర్ధికంఆ ఏమైనా లబ్దిపొందాడా లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సదరు మ్యూజిక్ కంపెనీ బద్యాకర్ నుంచి కచ్చా బాదమ్ రైట్స్ కొనేసింది. ఈ ఒప్పందంలో భాగంగా బద్యాకర్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాం. అతనికి అడ్వాన్స్‌గా రూ. 1.5 చెక్కు అందించాం. మిగిలిన మొత్తం వచ్చే వారం అతనికి చెల్లిస్తాం’ అని గోధూలిబేల మ్యూజిక్ గోపాల్ ఘోష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment