బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవక్కర్లేదు. తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ పెద్దల విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఎక్స్‌పోజ్ చేస్తూ ఇటీవల షేర్ చేసిన ఆమె ఫొటోలు నెట్టింట దూమారం రేపాయి. బి-టౌన్ నెపోటిజమ్‌పై(బంధుప్రీతి) అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు జాతీయ సమస్యలపై కూడా స్పందిస్తూ ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని చెప్పే కంగనా తాజాగా అంతర్జాతీయ సమస్యలపై కూడా స్పందించింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కంగనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. తన ఇన్‌స్టా అకౌంట్ చైనా హ్యాక్ చేసిందని, తాలిబన్లపై తాను చేసిన పోస్టులు కనిపంచడం లేదంటూ ఆరోపణలు చేసింది. ‘నిన్న రాత్రి చైనాకు చెందిన వారు నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ఇన్‌స్టాలో అలర్ట్ వచ్చింది. తెల్లవారు జామున లేచి చూసేసరికి అలర్ట్ మెసేజ్‌తో పాటు తాలిబన్ల గురించి నేను పెట్టిన స్టోరీలు మాయమయ్యాయి. కాసేపటికి నా అకౌంట్ కూడా కనిపించకుండా పోయింది. వెంటనే నేను ఇన్‌స్టాగ్రామ్ నిర్వహాకులకు ఫిర్యాదు చేయడం నా అకౌంట్ తిరిగి యాక్టివేట్ అయ్యింది.
కానీ నేను ఏ పోస్టు చేద్దామని ఏదైనా రాయబోతుంటే లాగ్ అవుట్ అవుతుంది. మా చెల్లెలి ఫోన్ తీసుకుని లాగీన్ అవుతున్న అదే అవుతుంది. నమ్మలేకపోతున్నా.. ఇదంత చూస్తుంటే అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుంది’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలీత జీవిత కథ ఆధారం తెరకెక్కిన తలైవి చిత్రంలో కంగనా లీడ్‌రోల్ పోషించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకు ఈ మూవీ పూర్తి స్థాయిలో థివయేటర్లు తెరుచుకోగానే విడుదల కానుంది. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వలో రూపోందిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో హిందీలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment