
Indrajeet Director KV Raju: కన్నడ డైరెక్టర్ కేవీ రాజు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నాడు బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సాండల్‌వుడ్ దర్శకులు సుని, రఘు శాస్త్రి, గేయ రచయిత అరసు అంతరే సహా పలువురు నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 1982లో కేవీ జయరామ్ డైరెక్ట్ చేసిన 'బడద హూ' సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. 1984లో ఒలవే బడుకు సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆయన 80, 90 దశకాలలో ఎన్నో హిట్లను కన్నడ చిత్రసీమకు అందించారు.
ఈ క్రమంలో దేవ్‌రాజ్, జగ్గేశ్, శశికుమార్ వంటి బడా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అమితాబ్ బచ్చన్, జయప్రదల ఇంద్రజిత్ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. హిందీలో ఉదర్ కీ జిందగీ, ఖూనీ జంగ్ సినిమాలు చేశారు. విభిన్న సినిమాలను రూపొందిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఆయన కుమారుడు అమోఘ్ ద కలర్ ఆఫ్ టమాట సినిమాతో సాండల్‌వుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment