నటుడు దర్శన్‌పై ఓ నిర్మాత కెంగేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు... భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పేరుతో భరత్ అనే వ్యక్తి సినిమా తీస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైందీ సినిమా. ఇందులో విలన్ పాత్రలో ధ్రువన్ (సూరత్) నటిస్తున్నారు. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావటంతో చిత్రీకరణ అలస్యమైనట్లు ధ్రువన్ వద్ద భరత్ వాపోయాడు.
అయితే ధ్రువన్ ఈ విషయం చెప్పటానికి దర్శన్‌కు ఫోన్ చేశారు. అదే సమయంలో ఫోన్‌లో నిర్మాతను బెదిరించినట్లు భరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎన్‌సీఆర్‌ను నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు ఆంథోని, కెమరామ్యాన్‌లను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దర్శన్ మాట్లాడిన ఆడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. నీవు ఉండవు... ఏమైనా చేయాలంటే చెప్పే చేస్తా రెడీగా ఉండండి, నీవు కనపడకుండా పోతావంటూ ఆడియోలో ఉంది. ఈ ఆడియోలోని ధ్వని దర్శన్‌గా గుర్తించారు. దీంతో చందన సీమలో ఆడియోపై చర్చ సాగుతోంది.
చదవండి: Mukesh Khanna: బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment