
నటి కీర్తీసురేష్‌కి కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఈ తరువాత నటించిన కొన్ని హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు నిరాశ పరచడంతో ఇక లాభం లేదనుకుందేమో గ్లామర్‌కు మారిపోయింది. అలా కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన కీర్తీసురేశ్ ఇటీవల తమిళంలో సానికాగితం అనే చిత్రంలో డీగ్లామర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అందులో ఈమె పోలీస్ పాత్రలో నటించింది.
కాగా తాజాగా మరోసారి లాఠీ చేత పట్టడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ తాజాగా తమిళంలో జయంరవికి జంటగా నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ద్వారా ఆంటోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు హీరో, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలకు కథా రచయితగా పని చేశారు. ఇంతకు ముందు అడంగ మరు, భూమి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హోమ్ మీడియా మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈనెల 29న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. కాగా ఇందులో నటి కీర్తీసురేష్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంతో పాటు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామణిదన్ చిత్రంలోనూ కీర్తీసురేశ్ కథానాయికగా నటిస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment