కేజీఎఫ్ క్రేజ్ మామూలుగా లేదసలు. సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఓ సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రిలీజైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డుల మోత మోగిస్తుంది. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు సంపాదించిన తొలి టీజర్‌గా పేరు తెచ్చుకుంది. 72 మిలియన్ల వ్యూస్‌తో కేవలం ఒక్క రోజులోనే ఎక్కువ మంది చూసిన వీడియోగా రికార్డు కైవసం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ మార్క్‌ను సైతం అలవోకగా దాటేసింది. దీంతో యూట్యూబ్‌లో ఈ టీజర్ నెంబర్ 1 స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టిస్తోంది.
దీని హవా చూస్తుంటే బాహుబలి రికార్డులను కూడా తుడిచిపెట్టేలా కనిపిస్తోంది. అయితే కరోనా తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ రేంజు కలెక్షన్లు రాబడుతుందా? అన్న సందేహాలూ లేకపోలేదు. కానీ అటు దర్శకుడితో పాటు సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత యశ్ కూడా తన భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ చిత్రం నుంచి ఏది ట్రెండ్ అయినా ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా కన్నడ స్టార్ యశ్ రాఖీభాయ్‌గా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ భారీ చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. (చదవండి: రవితేజ సినిమా.. పదే పదే క్యాన్సిల్ ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment