టీజర్‌తో 'కేజీఎఫ్‌ 2' సునామీ, ఈ దూకుడును ఎవరూ ఆపలేరంతే! | KGF 2 Teaser Creates Youtube Record With 200 Million Views | Sakshi
Sakshi News home page

KGF 2: ఇది మామూలు క్రేజ్‌ కాదు, టీజర్‌కు రికార్డు వ్యూస్‌

Published Fri, Jul 16 2021 6:23 PM | Last Updated on Fri, Jul 16 2021 6:23 PM

KGF 2 Teaser Creates Youtube Record With 200 Million Views - Sakshi

KGF 2 Teaser Get 200 Million Views: యశ్‌ బాస్‌ ఇంకా బరిలోకి దిగనేలేదు.. అప్పుడే కేజీఎప్‌ 2 టీజర్‌ రికార్డుల మోత మోగిస్తున్నాయి. దుమ్మురేపే వ్యూస్‌తో పాన్‌ ఇండియా సినిమాలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇంతకీ కేజీఎఫ్‌ 2 కొత్తగా సాధించిన రికార్డు ఏంటనుకుంటున్నారా? అక్షరాలా రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ను సాధించిందీ టీజర్‌. ఈ విషయాన్ని స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా సోషల్‌మీడియాలో వెల్లడించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

జనవరి 7న యూట్యూబ్‌లో రిలీజైన కేజీఎఫ్‌ 2 సినిమా టీజర్‌కు ఇప్పటిదాకా 200 మిలియన్ల(20 కోట్ల) వ్యూస్‌ వచ్చాయి. ఈ టీజర్‌ను 8.4 మిలియన్ల మంది లైక్‌ చేయగా 11 లక్షల మంది కామెంట్లు రాగా, 1 బిలియన్‌ ఇంప్రెషన్స్‌ వచ్చాయి. దీంతో సోషల్‌ మీడియాలో #KGF2Teaser200MViews పేరిట సందడి చేస్తున్నారు అభిమానులు. ఎంతైనా బాస్‌ సర్‌.. బాస్‌ అంతే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి టీజర్‌ ద్వారా ఓరకంగా సునామీనే సృష్టిస్తున్నాడు రాఖీ భాయ్‌. మరి ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యాక ఆ ప్రభంజనం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement