
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆశించిన స్థాయిలో సక్సెస్ రేట్ లేకపోయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా పెద్ద బ్యానర్స్‌లో అవకాశాలు వస్తుండటంపై గత కొంతకాలంగా కిరణ్ అబ్బవరంపై రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా తనపై వస్తోన్న కామెంట్స్‌పై కిరణ్ అబ్బవరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికి థ్యాంక్స్. నా ఎదుగుదలకు మీ సపోర్టే కారణం. మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఇక నాకు ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? గట్టి సపోర్ట్ ఉందేమో అంటూ చేస్తున్న కామెంట్స్‌కి నా సమాధానం ఒక్కటే హార్డ్‌వర్క్.
క్లాసులో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు వచ్చాయనే బాధ,నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగిటివిటీనే నామీద వస్తుంది. అంటే జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. అవకాశం వచ్చినప్పుడు కష్టపడి పని చేస్తున్నాను'' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
❤️❤️#Cinema #Greatful pic.twitter.com/2S6PidyYtP
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 17, 2022