సెట్స్‌లో తనకు చుక్కలు చూపించారని బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ ఇటీవల శుభ్ షాగుణ్ సీరియల్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను గదిలో పెట్టి బంధించారని వాపోయింది. తన పారితోషికం కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చింది.
గూండాల్లా ప్రవర్తించారు
కృష్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. నిర్మాత కుందన్ సింగ్ నన్ను గదిలో బంధించాడని చెప్పలేదు. ఆ బ్యానర్‌లో పని చేసిన వాళ్లు నన్ను గదిలో లాక్ చేశారు. అయితే అతడు చెప్పడం వల్లే వాళ్లు ఈ పని చేశారు. రెండుసార్లు గదిలో బంధించి వేధించారు. గూండాల్లా ప్రవర్తించారు. ఇప్పుడతడు దీన్ని ఎలా కవర్ చేయాలా? అని ఆలోచిస్తున్నాడు. నేను ముంబైలోని మధ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందన్నాను. కానీ అది గోరెగావ్‌లోని ఫేమస్ స్టూడియోలో జరిగింది. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది.
వాళ్లు కనిపించనేలేదు
కుందన్ చాలా తెలివైనవాడు. బేటా బేటా అంటూ అందరినీ కాకాపట్టేవాడు. అక్టోబర్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యాక నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపేశాడు. అయితే సీరియల్ యూనిట్‌కు చెందిన స్వాతి తనవాల నాకు అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకావని హామీ ఇచ్చింది. నన్ను గదిలో బంధించిన ప్రభాత్, సమీర్‌లపై చర్యలు తీసుకుంది. వాళ్లు ఎప్పుడూ నాకు సెట్స్‌లో మళ్లీ కనిపించనేలేదు.
12 గంటల పని..
కానీ డబ్బుల కోసం మాత్రం ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండేవాళ్లం. షెహజాదాది కూడా ఇదే పరిస్థితి.. తనకూ పైసలివ్వకుండా వేధించారు. ఓసారి తనే నన్ను కాపాడాడు. ఇప్పటికీ డిప్రెషన్ నుంచి బయటపడలేదు. డాక్టర్లను, థెరపిస్టులను కలుస్తూనే ఉన్నాను. రోజుకు 12 గంటలపాటు పని చేయించుకున్నారు.. రెమ్యునరేషన్ మాత్రం ఆపేశారు. నాకు రూ.39 లక్షలు బాకీ ఉన్నారు. నాకే కాదు ఇంకా చాలామందికి వారు డబ్బులివ్వలేదు' అని కృష్ణ ముఖర్జీ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment