Kriti Sanon Reveals Her Beauty Secret - Sakshi
Sakshi News home page

Kriti Sanon: దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్‌

Published Sun, Jul 10 2022 11:02 AM | Last Updated on Sun, Jul 10 2022 1:47 PM

Kriti Sanon Reveals Her Beauty Secret - Sakshi

నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతీ సనన్‌. గ్లామరస్‌ పాత్రలే కాకుండా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించడం ఈ బ్యూటీకిష్టం. ఈ క్రమంలో మిమి సినిమాలో నటించి అందరి ప్రశంసలు పొందుకుంది. అయితే ఈ మూవీలోని రోల్‌ తన ఫిట్‌నెస్‌కు స్ఫూర్తినిచ్చిందంటూ మే నెలలో 'ది ట్రైబ్‌' అనే జిమ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఫిట్‌నెస్‌కే అందానికి సైతం ప్రాధాన్యతనిచ్చే కృతీ తాజాగా తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది.

నా బ్యూటీ సీక్రెట్‌ మంచినీళ్లు. ఎస్‌.. మా అమ్మ చెప్పిన సీక్రెట్‌ అది. చిన్నప్పుడు ఆటల్లో ఉన్నా.. చదువులో ఉన్నా.. పట్టిపట్టి మంచినీళ్లు పట్టించేది. అప్పుడు మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. మంచినీళ్లు శరీరాన్ని తేమగా ఉంచడమే కాదు.. లోపలున్న టాక్సిన్స్‌ను బయటకు తోసేస్తాయని అందరికీ తెలుసు. కానీ నీళ్లు తాగడాన్ని అశ్రద్ధ చేస్తాం. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు మంచినీళ్లను అశ్రద్ధ చేయరు.. చేయకూడదని నా అభిప్రాయం. మంచినీళ్లతో పాటుగా నేను ప్రతిరోజూ తాజా కూరగాయల రసాన్నీ తీసుకుంటాను. అది నేను కనుగొన్న బ్యూటీ సీక్రెట్‌
– కృతి సనన్‌

చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది
 పాన్‌లో విషం కలిపారు, సరిగ్గా తినే సమయంలో ఫోన్‌ రావడంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement