Lavanya Tripathi responds to her marriage rumours - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి.. లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Mar 4 2023 10:06 AM | Updated on Mar 4 2023 11:22 AM

Lavanya Tripathi Respond on Her Marriage Rumours That She Knot in 2023 - Sakshi

లావణ్య త్రిపాఠి.. ఈ మధ్య సినిమాలతో కంటే పెళ్లి, రూమర్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో డేటింగ్‌లో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇవన్ని వట్టి పుకార్లనే లావణ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్లకు చెక్‌ పడింది. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ షోలో పాల్గొన్న ఆమె వరుణ్‌ తేజ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ అంటూ కామెంట్‌ చేసి మరోసారి డేటింగ్‌ పుకార్లకు తెరలేపింది. దీంతో ఈ ఏడాదే వరుణ్‌-లావణ్యల పెళ్లి అంటూ పుకార్లు గుప్పుమన్నాయి.

కాగా లావణ్య నటించిన లేటెస్ట్‌​ మూవీ ‘పులిమేక’. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెకు తన పెళ్లి పుకార్లపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. ‘ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు ఎందుకు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది’ అని చెప్పింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘టైం గాడ్‌ నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే పెళ్లి విషయంలో నా తల్లింద్రుడులు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు.

కాబట్టి నేను కూడా నా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌, సినిమాలపైనే ఉంది. కానీ, పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. మన లైఫ్‌లోకి కరెక్ట్‌ పర్సన్‌ వచ్చినప్పుడే అది జరుగుతుంది. అప్పుటి వరకు వేచి చూడాలి. నచ్చిన వ్యక్తి మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి అనేది అందంగా ఉంటుంది. అలాగే పెళ్లి అనే సాంప్రదాయాన్ని కూడా నేను ఇష్టపడతాను.. కానీ అది కరెక్ట్‌ టైంలో జరిగినప్పుడే. అందుకే అందరిలా నేను పెళ్లి గురించి, పెళ్లిలో ఏం వేసుకోవాలంటూ కలలు కనడం లేదు’ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. 

చదవండి: 
అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..
7 నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన ది లెజెంట్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement